కస్టమర్ సర్విస్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కి Tech Mahindra కంపెనీలో భారీగా ఉద్యోగాలు | Tech Mahindra Recruitment 2026 | Latest Jobs in Telugu
Latest Tech Mahindra Recruitment 2026 | Tech Mahindra Jobs in Telugu
భారతదేశంలో ప్రముఖ ఐటీ మరియు బీపీఓ సేవల సంస్థ అయిన Tech Mahindra కంపెనీ నుండి నిరుద్యోగులకు మంచి అవకాశం వచ్చింది. ఈ కంపెనీ కస్టమర్ సర్విస్ ఎగ్జిక్యూటివ్ ( Customer Service Executive ) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే Any Degree పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Tech Mahindra కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 4 వారాలు ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైమ్ జాబ్ ఆఫర్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో 22,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంభంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ Updates ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest Tech Mahindra Recruitment 2026 Overview :
Table of Contents

🛑 కంపెనీ పేరు : టెక్ మహీంద్రా ( Tech Mahindra )
🛑 జాబ్ రోల్ : Customer Service Executive
🛑 విద్య అర్హత : Any Degree
🛑 అనుభవం : అవసరం లేధు
🛑 జీతం : 2 to 3 LPA
🛑 జాబ్ లొకేషన్ : Bangalore
Latest Tech Mahindra Recruitment 2026 Full Details in Telugu :
ఉద్యోగ వివరాలు :
పోస్ట్ పేరు: Customer Service Executive.
పని చేసే ప్రదేశం: బెంగళూరు, కర్ణాటక.
అనుభవం: 0 – 5 సంవత్సరాలు.
ఉద్యోగ రకం: ఫుల్ టైమ్.
షిఫ్ట్ విధానం: రోటేషనల్ షిఫ్ట్‌లు ఉండవచ్చు.
ఈ పోస్టులో ఎంపికైన అభ్యర్థులు కస్టమర్లకు ఫోన్, చాట్ లేదా ఇమెయిల్ ద్వారా సపోర్ట్ అందించాలి.

కంపెనీ గురించి :
Tech Mahindra భారతదేశానికి చెందిన ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ. ఇది టెలికాం, ఐటీ, కస్టమర్ సపోర్ట్, బీపీఓ వంటి రంగాల్లో సేవలు అందిస్తోంది. దేశవ్యాప్తంగా మరియు విదేశాల్లో కూడా కంపెనీకి అనేక బ్రాంచ్‌లు ఉన్నాయి. ఈ సంస్థలో ఉద్యోగం పొందడం అంటే మంచి భవిష్యత్తుకు బాట వేసుకున్నట్లే.
విద్యార్హతలు :
- ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు.
- కొన్ని ప్రాసెస్‌లకు 12వ తరగతి ఉత్తీర్ణత కూడా సరిపోతుంది.
- ఫ్రెషర్స్ మరియు అనుభవం ఉన్న అభ్యర్థులు ఇద్దరూ అర్హులు.
- ఇంగ్షీష్ లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
అవసరమైన నైపుణ్యాలు :
- స్పష్టమైన కమ్యూనికేషన్ మరియు కస్టమర్ సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించే సామర్థ్యం ఉండాలి.
- బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ మరియు టీమ్‌లో పనిచేసే నైపుణ్యం ఉండాలి.
- ఒత్తిడిలో కూడా సమర్థంగా పని చేసే ధైర్యం ఉండాలి.
మరిన్ని ఉద్యోగాలు :
💥Harman కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోస్ట్ కి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
💥ప్రముఖ BPO కంపెనీ IntouchCX చాట్ ప్రాసెస్ పోస్టుల కోసం ఉద్యోగ ఆహ్వానం
💥ప్రముఖ ఐటీ సంస్థ Zoho కంపెనీ లో సాఫ్ట్వేర్ డెవెలపర్ పోస్ట్ కి ఉద్యోగాలు భర్తీ
పని బాధ్యతలు :
- కస్టమర్ల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం.
- కంప్లైంట్స్ నమోదు చేసి పరిష్కరించడం మరియు ప్రోడక్ట్ మరియు సర్వీస్ సమాచారం అందించడం.
- కస్టమర్ డేటాను సిస్టమ్‌లో అప్డేట్ చేయడం మరియు కస్టమర్ సంతృప్తి పెంచడం.
వేతనం మరియు ఇతర ప్రయోజనాలు :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు అనుభవం ఆధారంగా సుమారు ₹1.8 లక్షల నుంచి ₹3 లక్షల వరకు వార్షిక వేతనం ఇవ్వబడుతుంది. అదనంగా పెర్ఫార్మెన్స్ బోనస్, ఇన్సెంటివ్స్ మరియు కంపెనీ తరఫున ట్రైనింగ్ కూడా అందించబడుతుంది. కెరీర్ గ్రోత్ అవకాశాలు కూడా మంచి స్థాయిలో ఉంటాయి.

వయస్సు పరిమితి :
- కనీస వయస్సు 18 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు కంపెనీ నిబంధనల ప్రకారం ఉంటుంది
- ఫ్రెషర్స్ కూడా అప్లై చేయవచ్చు
ఎంపిక విధానం :
- ఆన్‌లైన్ అప్లికేషన్ మరియు రిజ్యూమ్ షార్ట్‌లిస్టింగ్ చేయటం.
- HR ఇంటర్వ్యూ మరియు వాయిస్ లేదా కమ్యూనికేషన్ రౌండ్ చేయడం.
- ఫైనల్ సెలెక్షన్
ఎలా దరఖాస్తు చేయాలి :
ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక జాబ్ పోర్టల్ ద్వారా అప్లై చేయాలి. ముందుగా ప్రొఫైల్‌లో లాగిన్ అయి “Apply” బటన్‌పై క్లిక్ చేసి, మీ రిజ్యూమ్ అప్‌డేట్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. షార్ట్‌లిస్ట్ అయిన వారికి కంపెనీ నుండి ఇంటర్వ్యూ కాల్ వస్తుంది.
More Details & Apply Link : Click Here
గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.
* షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.